పర్యాటక ప్రాంతాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
సాక్షి,పాడేరు: జిల్లాలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో అవసరమైన సౌకర్యాలను గుర్తించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయం నుంచి పర్యాటక అఽభివృద్ధిపై అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో ఎంట్రీ, స్టాళ్లకు సంబంధించి పర్యాటకుల నుంచి ఫీజులు వసూలుపై తనకు నివేదిక అందజేయాలన్నారు. పంచాయతీరాజ్, ఐటీడీఏ, పంచాయతీలు, రెవెన్యూ సంఘాలు చేస్తున్న ఫీజుల వసూళ్లు మొత్తం క్రెడిట్ అవుతున్న ఖాతాలు, వారు కల్పిస్తున్న లైటింగ్, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సేవల సమగ్ర వివరాల నివేదికలు అందించాలని సూచించారు. వాటిని నెల రోజుల్లోగా క్రమబద్ధీకరించాలని ఆదేశించారు.
‘చలి అరకు ఉత్సవ్’ ఏర్పాట్లు వేగవంతం
చలి అరకు ఉత్సవ్‌కు సంబంధించి ఏర్పాట్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అరకులోయలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న అరకు ఉత్సవ్‌కు వివిధ రాష్ట్రాల నుంచి గిరిజన కళాకారులను రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మణిపూర్, ఒడిశా,తెలంగాణ, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల నుంచి గిరిజన సంప్రదాయ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మారథాన్, కార్నివాల్‌తో పాటు బొర్రాగుహల నుంచి అరకులోయ వేదిక వరకు ప్రోఫెసనల్స్‌తో సైక్లింగ్, మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. అరకు ఉత్సవ్ బ్లాగ్ ఏర్పాటు చేసి ప్రోమోతో పాటు ఎప్పటికప్పుడు కార్యక్రమాలను అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఈవెంట్లకు సంబంధించి క్యూ ఆర్ కోడ్ ఏర్పాటుతో పాటు ప్రోమో ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు. కళారూపాలన్ని వారి సంప్రదాయ డ్రెస్‌లలోనే ఉండాలని, పుడ్‌కోర్టులు, అమ్యూజ్‌మెంట్, టూరిజం బ్రోచర్లు, ట్రైబల్ ప్యాషన్‌షో, యోగ, హాట్ ఎయిర్‌బెలూన్, పారా మోటరింగ్ లాంటి సాహన క్రీడలు ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవానికి వచ్చే అతిథులులకు వసతి, భోజనం, రవాణాతో పాటు జ్ఞాపికలు ఆంశాలపై దృష్టిసారించి, ఇందుకు సంబంధించి నివేదికలు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం నుంచి జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ, పాడేరు సబ్‌కలెక్టర్ సౌర్యమన్‌పటేల్, డీఆర్వో పద్మలత, వర్చువల్ విధానంలో రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పశ్రీ, టూరిజం డివిజనల్ మేనేజర్ జగదీశ్వరరావు, అల్లూరి సీతారామరాజు స్మారక మ్యూజియం క్యూరేటర్ డాక్టర్ శంకరరావు, జిల్లా టూరిజం అధికారి జి.దాసు, గిరిజన మ్యూజియం క్యూరేటర్ మురళి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment