సమస్యలు పరిష్కరించాలి
పాడేరు పట్టణానికి సమీపంలోని జాయింట్ కలెక్టర్ బంగ్లా ప్రాంతంలో శుక్రవారం వేకువజామున అరుణో దయం అందాలు చూపరులను ఎంతగానో అబ్బురపరిచాయి. పర్యాటకులతో పాటు ప్రకృతి ప్రేమికులు ఈ అపురూప దృశ్యాలను కెమెరాల్లో బంధించి పదిల పరచుకున్నారు. – సాక్షి, పాడేరు
● గ్రామ వలంటీర్ల డిమాండ్
● రంపచోడవరంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభం
రంపచోడవరం: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఐటీడీఏ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ వలంటీర్లు శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వీటిని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు మట్ల వాణిశ్రీ, జిల్లా ఉపాధ్యక్షులు కె.శాంతి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం గ్రామ వాలంటీర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వలంటీర్ల జిల్లా కార్యదర్శి సవలం సుబ్రహ్మణ్యం, జిల్లా నాయకులు కుంజం భానుప్రియ. ఎం.కామేశ్వరి, జే దేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment