క్రియ పిల్లల పండగలో ప్రతిభ
రాజవొమ్మంగి: కాకినాడలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి క్రియ పిల్లల పండగలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వీరిని గురువారం పాఠశాల హెచ్‌ఎం డీవీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. జానపద నృత్యం, చిత్రలేఖనం, మ్యాప్ పాయింటింగ్, ఏకపాత్రాభినయం, కోలాటం, మట్టిబొమ్మలు, క్విజ్ తదితర పోటీల్లో పాఠశాల తరఫున సుమారు 60 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. కోలాటంలో రాష్ట్రస్థాయిలో కన్సోలేషన్‌లో ద్వితీయస్థానం సాధించినట్టు హెచ్‌ఎం తెలిపారు. అభినందన కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీవీఎస్‌ఎన్. మూర్తి, శివకృష్ణ, కొండబాబు, రాజమ్మ, పోసిబాబు, సత్యంబాబు, ఏసుకుమారి, పీడీ పాల్‌బాబు, హెచ్‌ఎం గోపాలకృష్ణ, ఎస్‌ఎంసీ చైర్మన్ శ్రీనివాస్, వెంకటమణ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
బహుమతులు సాధించిన రాజవొమ్మంగి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు
పలువురి అభినందన
Comments
Please login to add a commentAdd a comment