● కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: సామాజిక పింఛన్ల పంపిణీలో జిల్లా ఈనెలలో కూడా మొదటి స్థానం సాధించిందని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1లక్షా 23వేల 679మంది పింఛన్‌దారులకు గాను గురువారం రాత్రి సమయానికి 1,22,752 మందికి పంపిణీ చేసి 99.25శాతం సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానం పొందామని తెలిపారు. గత నాలుగు నెలలుగా పింఛన్ల పంపిణీలో జిల్లా మొదటి స్థానం సాధించడం సంతోషంగా ఉందని, ఈమేరకు డీఆర్‌డీఏ పీడీ మురళీ, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఇతర సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment