రేపు పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా
పారా గ్లైడింగ్ ట్రయల్ రన్ సక్సెస్
– ఐటీడీఏ పీవో అభిషేక్
అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక కేంద్రం మాడగడ సన్‌రైజ్ పాయింట్ వద్ద ఆదివారం నిర్వహించిన పారా గ్లైడింగ్ ట్రయల్‌రన్ విజయవంతమైనట్టు ఐటీడీఏ పీవో అభిషేక్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం హిమాచల్‌ప్రదేశ్ ఆరెంజ్ పారాగ్లైడింగ్ స్కూల్ పైలెట్ శిక్షకులు విజయ్ సోనీ నేతృత్వంలో పారాగ్లైడింగ్ ట్రైనీ అలీషా.. ఈ ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా విజయ్ సోనీ మాట్లాడుతూ మాడగడ ప్రాంతం పారాగ్లైడింగ్‌కు అత్యంత అనుకూలంగా ఉందన్నారు. పర్యాటకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని చెప్పారు. అరకులోయ లో చలి ఉత్సవం సందర్భంగా పారా గ్లైడింగ్‌ను ఏర్పాటు చేస్తున్నామని పీవో తెలిపారు.
పెందుర్తి(విశాఖ) : స్కిల్ డెవెలప్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో పలు ప్రైవేటు కంపెనీల్లో ఉపాధి నిమిత్తం మంగళవారం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.చంద్రశేఖర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ కంపెనీల్లో 250 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్ ఉతీర్ణులైన, 18–35 ఏళ్ల మధ్య వయస్నువారు. ఇంటర్వ్యూలకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 77025 06614 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు.
10 ఎఫ్‌పీజీలకు వర్మీ కంపోస్టు కిట్ల పంపిణీ
జి.మాడుగుల: ప్రకృతి సేద్యంతో అధిక దిగుబడులు సాధించాలని సెంటర్ ఫర్ సోషల్ మార్కెటింగ్(సీఎస్‌ఎం) సీఈవో అభిషేక్ తెలిపారు. స్థానిక మత్స్య దేవత రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం సీఈవో ఐసరం హనుమంతరావు ఆధ్వర్యంలో ఆది వారం 10 ఎఫ్‌పీజీలకు వర్మీ కంపోస్టు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అభిషేక్ రైతులకు పలు సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment