సాక్షి,పాడేరు: పర్యాటకులను ఆకట్టుకునేలా చలి అరకు ఉత్సవ్ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ తెలిపారు. అధికారులతో ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఉత్సవ్ ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. అరకులోయలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవ్‌లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే గిరిజన కళాకారులతో రోజువారీ కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.చలి అరకు ఉత్సవ్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. జిల్లాలోని పర్యాటక కేంద్రాల వీడియోలను ప్రమోషన్ క్యాంపెయిన్‌లలో ప్రదర్శించాలని తెలిపారు. ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్ పలు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ, ఐటీడీఏ పీవో అభిషేక్,పాడేరు సబ్‌కలెక్టర్ సౌర్యమన్‌పటేల్, అల్లూరి సీతారామరాజు స్మారక మ్యూజియం క్యూరేటర్ డాక్టర్ శంకరరావు, గిరిజన మ్యూజియం క్యూరేటర్ మురళీ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment