రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మునగపాక: మునగపాక దరి ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పాదచారుడు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గంగాదేవిపేటకు చెందిన బత్తిన గంగరాజు(65) వ్యవసాయం సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి మునగపాక నుంచి గంగాదేవిపేటకు నడుచుకుంటూ వస్తున్నాడు. అయిదు మదుంల జంక్షన్‌కు వచ్చే సరికి అనకాపల్లి నుంచి మునగపాక వైపునకు వస్తున్న ద్విచక్ర వాహనం అతనిని బలంగా ఢీకొట్టింది. దీంతో గంగరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మునగపాక ఎస్‌ఐ పి.ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు గంగరాజుకు భార్య వెంకయమ్మ, కూతురు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న గంగరాజు మృతితో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment