వైభవంగా మోదకొండమ్మ తీర్థం
సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరులోని మోదకొండమ్మతల్లి తీర్థ మహోత్సవా న్ని మోదమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకుడు సుబ్రహ్మణ్యం వేకువజాము నుంచే కుంకుమార్చనలు చేశారు. పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేయడంతో పాటు మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, జెడ్పీటీసీ శివరత్నం దంపతులు, అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, డాక్టర్ నరసింగరావులు మోదమ్మకు పూజలు చేశారు.
ఘనంగా ఊరేగింపు
మోదకొండమ్మతల్లి ఉత్సవ విగ్రహ ఊరేగింపు సంబరం అంబరాన్ని తాకింది. సాయంత్రం ప్రత్యేక పూజల అనంతరం పల్లకీలో ఊరేగించారు. ఎమ్మెల్యే పల్లకీని మోసి ఊరేగింపును ప్రారంభించా రు. శక్తివేషాలు,కోలాటం, దేవతామూర్తుల వేషాలతో కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.రాత్రి వరకు ఊరేగింపు సంబరం పాడేరు వీధుల్లో సాగింది. ఒడిశా బ్యాండు కళాకారులు హోరెత్తించారు. భారీగా బాణసంచా కాల్చారు. మోదకొండమ్మ సారె ఊరేగింపు కార్యక్రమాన్ని పాడేరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు.పాడేరు పరిధిలోని అన్ని సామాజిక వర్గాలకు చెందిన మహిళలు భక్తిశ్రద్ధలతో సారెను తీసుకొచ్చారు. సుండ్రుపుట్టు సాయిబాబా ఆలయం నుంచి ఈ ఊరేగింపును ప్రారంభించారు.ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు,మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, డాక్టర్ నరసింగరావు,మాజీ మంత్రి మణికుమారి,మాజీ జెడ్పీచైర్‌పర్సన్ వంజంగి కాంతమ్మ,ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు,ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కోటిబాబునాయు డు, ఇతర సభ్యులు,మహిళలు మోదమ్మ సారెను తలపై పెట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం మోదకొండమ్మతల్లికి సమర్పించారు.
ఉత్సాహంగా ముగ్గుల పోటీలు
మోదమ్మ ఆలయ ఆడిటోరియంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అరకులోయ,పాడేరు ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, మత్స్యరాస విశ్వేశ్వరరాజు పోటీలను పరిశీలించి, పాల్గొన్న వారందరికీ మెమెంటోలను అందజేశారు. ప్రథమ, ద్వితీయ,తృతీయ విజేతలకు నగదు బహుమతులను రాత్రి జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అందజేశారు.
ఎమ్మెల్యే మత్స్యలింగంకు ఘన సన్మానం
మోదకొండమ్మతల్లి తీర్థ మహోత్సవానికి వచ్చిన అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంను పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, ఆలయ కమిటీ ప్రతినిధులు దుశ్శాలువాతో సన్మానించి, మోదమ్మ చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. మోదమ్మ తీర్థ మహోత్సవంలో ఆలయ కమిటీ ప్రతినిధులు డి.పి.రాంబాబు,సల్లా రామకృష్ణ,తమర్భ ప్రసాద నాయుడు, బోనంగి రమణ,లకే రత్నాబాయి,కిల్లు చంద్రమోహన్, రాధాకృష్ణ,కొణతాల సతీష్, కూడా సురేష్ కుమార్, సర్పంచ్‌లు,ఎంపీటీసీలు,అన్ని రాజకీయ పార్టీల నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భారీగా తరలివచ్చిన భక్తులు
ఘనంగా ఊరేగింపు సంబరం
మోదకొండమ్మను దర్శించుకుంటున్న భక్తులు
Comments
Please login to add a commentAdd a comment