ఏరియా ఆస్పత్రిలో గర్భిణికి ప్రసవం
డుంబ్రిగుడ: నిండు గర్భిణి నరకయాతన అనే వార్తకు స్పందించి మండలంలోని ఐసీడీఎస్ సీడీపీవో నీలిమ ఆదేశాల మేరకు ఆదివారం ఐసీడీఎస్ సూపర్‌వైజర్ వెంకటలక్ష్మి, కమలబంద అంగన్‌వాడీ టీచర్ రాధా అరకులోయ ఏరియా ఆస్పత్రిలో సందర్శించి ఆదివారం ఉదయం ప్రసవించిన పాంగి సువాని మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్టు వారు తెలిపారు. శనివారం రాత్రి నిండు గర్భిణి నరకయాతనతో కలమలబంద నుంచి కిల్లోగుడ పీహెచ్‌సీకి తర్వాత అరకులోయ ఏరియా ఆస్పత్రికి ఆటోలో కుటుంబీకులు, వైఎస్సార్‌సీపీ నాయకుడు నరసింగరావు అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్యలింగం చోరవతో చేర్పించిన సంగతి తెలిసిందే. ప్రసవవేదనతో ఇబ్బందులు పడినా ఎట్టకేలకు గర్భిణికి సుఖ ప్రసవించడంతో కుటుంవీకులు సంతోషించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్టు సీడీపీవో నీలిమ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment