కన్యకాపరమేశ్వరి ఆలయంలో పద్మాకర్ ప్రవచనం
అనకాపల్లి: స్థానిక మెయిన్‌రోడ్డు కన్యకాపరమేశ్వరి అమ్మవారి ప్రతిష్ట శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఏలూరులోని ప్రణవ పీఠం వ్యవస్థాపకుడు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ ‘మానవుడు– మాధవుడు’ అనే అంశంపై ప్రవచనం చేశారు. అంతకుముందు కన్యకాపరమేశ్వరి అమ్మవారిని పద్మాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, గోపుజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గ భద్రకాళి విజయ వైష్ణవి శారద నారాయణ అనే నామాలతో పిలవబడే అమ్మవారు కన్యకాపరమేశ్వరిగా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రతిష్ట శతజయంతి ఉత్సవ చైర్మన్ కోరుకొండ బుచ్చిరాజు, కో చైర్మన్ డాక్టర్ గ్రంథి శేషుకుమార్, ఆలయ అధ్యక్షుడు బిళ్లపాటి కృష్ణకుమార్, కోశాధికారి శ్రీధరాల సోమరాజు, కోశాధికారి శ్రీధరాల సోమరాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment