అంతర జిల్లాల క్రికెట్ విజేత విశాఖ
విశాఖ స్పోర్ట్స్: ఏసీఏ అంతర జిల్లాల బాలుర అండర్–12 క్రికెట్ విజేతగా విశాఖ జట్టు, రన్నరప్‌గా నెల్లూరు జట్టు నిలిచాయి. వైఎస్‌ఆర్ స్టేడియం బీ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్‌లో నెల్లూర్ కెప్టెన్ మౌనేష్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. విశాఖ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌గా కెప్టెన్ యాశిల్ విగ్నేష్(49) మరో ఓపెనర్ జాషువ(25)తో తొలి వికెట్‌కు 46 పరుగులు, సాయిదీపక్(20)తో రెండో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాలతో గట్టి పునాది వేశాడు. మోక్షిత్ 31 పరుగులతో విశాఖ జట్టు నిర్ణీత 35 ఓవర్లలో ఏడు వికెట్లకు 186 పరుగులు చేసింది. తన్విక్‌రెడ్డి రెండు వికెట్లు తీశాడు. ప్రతిగా నెల్లూరు ఓపెనర్లు మౌనేష్ డకౌట్‌గానే వెనుతిరగ్గా సోహన్ ఒక పరుగే చేయగలిగాడు. మహిధర్ 16, జాన్సన్ 19, పార్దివ్ 13, సమీర్ 30 పరుగులతో రెండంకెల స్కోర్ చేయగలిగారు. చివరికి 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులకు ఇన్నింగ్స్ ముగించారు. రోహిత్ మూడు వికెట్లు తీయగా షుణ్ముఖ, పవన్ రెండేసి వికెట్లు తీశారు. దీంతో విశాఖ 68 పరుగులతో టైటిల్ పోరులో విజయం సాధించింది. విజేతలకు ఏసీఏ ఉపాధ్యక్షుడు వెంకటరామ్‌ప్రశాంత్ ట్రోఫీలు ప్రదానం చేశారు. ఏసీఏ గేమ్ డెవలప్‌మెంట్ జీఎం కుమార్, ఏజీఎం శివకుమార్, వైఎస్‌ఆర్ స్టేడియం ఇన్‌చార్జి రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment