సేంద్రియ వ్యవసాయానికి మరింత ఆదరణ
చింతపల్లి: దేశీయంగానే కాక అంతర్జాతీయంగానూ సేంద్రియ వ్యవసాయానికి మంచి ఆదరణ, గుర్తింపు లభిస్తోందని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి అన్నారు. గురువారం స్థానిక పరిశోధన స్థానంలో గిరిజన యువతకు సేంద్రియ వ్యవసాయంపై ఆరురోజులపాటు స్వల్పకాలిక శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈసందర్బంగా ఏడీఆర్ మాట్లాడుతూ ఇతర రంగాల మాదిరిగానే వ్యవసాయ రంగంలోనూ యువత నైపుణ్యం మెరుగుపరచుకోవాలని సూచించారు. శిక్షణ అనంతరం యువతకు ధ్రువపత్రాలను జారీచేస్తామని తెలిపారు. మన్యంలో పండే ప్రధాన పంటలు , సేంద్రియ వ్యవసాయం అమలు తదితర అంశాలపై సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ బాలహుస్సేన్‌రెడ్డి, డాక్టర్ బయ్యపురెడ్డి వివరించారు. చింతపల్లి, పాడేరు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు సందీప్‌నాయక్, జోగారావు, డాక్టర్ ప్రదీప్‌కుమార్, చింతపల్లి యూబీఐ మేనేజరు శరత్ , ఆర్‌ఈఏసీ సభ్యుడు వండలం బాలయ్య పాల్గొన్నారు.
చింతపల్లి ఏడీఆర్ అప్పలస్వామి
Comments
Please login to add a commentAdd a comment