పాఠశాలల అభివృద్ధిలో కమిటీలు భాగస్వాములు కావాలి
చింతపల్లి: పాఠశాల అభివృద్ధిలో కమిటీలు భాగస్వాములు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు అన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల కమిటీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాల అభివృద్ధిలో కమిటీలు పనిచేయాలని సూచించారు. ఉపాధ్యాయులతో సమన్వయంగా వ్యవహకరిస్తూ వారికి అవసరమైన తోడ్పాటు అందించాలన్నారు. ప్రధానంగా మధ్యాహ్న భోజన పథకం అమలుతోపాటు మరుగుదొడ్ల నిర్వహణ, శానిటేషన్ వంటి వాటిలో అవసరమైన తోడ్పాటు, సహకారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు ప్రసాధ్, బోడంనాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment