వణుకుతున్న మన్యం
చింతపల్లి: మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో చలిగాలుల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గురువారం జి.మాడుగులలో 7.3 డిగ్రీలు, అరకువ్యాలీలో 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్, వాతావరణ విభాగం నోడల్ అధికారి ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. మరియు వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ డుంబ్రిగుడలో 9.1, గూడెంకొత్తవీధిలో 9.8, పెదబయలులో10.1, ముంచంగిపుట్టులో 10.2, అనంతగిరిలో 10.8, చింతపల్లిలో 11.3, హుుకుంపేటలో 12, పాడేరులో 12.1, కొయ్యూరులో 14.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని ఏడీఆర్ పేర్కొన్నారు.
పెరుగుతున్న చలి తీవ్రత
కొనసాగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
Comments
Please login to add a commentAdd a comment