25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
జిల్లా వ్యవసాయశాఖ అధికారి నందు
కొయ్యూరు: జిల్లాలో 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్.బి.ఎస్. నందు తెలిపారు. ఏవో ఉమాదేవితో కలిసి సింగవరం కొనుగోలు కేంద్రంలో ధాన్యంలో తేమ శాతాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ 46 ధాన్యం కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా ఇప్పటి వరకు 14 వేల మెట్రిక్ టన్నులు సేకరించామని చెప్పారు. ధాన్యం విక్రయించిన తరువాత కొద్ది రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ అవుతుందన్నారు. పాడేరు డివిజన్‌లో 25 రాగుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.క్వింటా(100 కిలోలు) రూ.4,290 చొప్పున కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు.500 టన్నుల రాగులను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
జీడి ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రతిపాదన
కొయ్యూరులో జీడి పిక్కల ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించామని చెప్పారు. జిల్లాలో సేంద్రియ సాగును ప్రోత్సహించడంతో పాటు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆర్‌జీఎల్‌కు బదులుగా ఎంటీయూ 1318రకం వరిని సాగుచేయాలని రైతులకు సూచిస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment