వార్డెన్, హెచ్‌ఎంలను సస్పెండ్ చేయాలి
పాడేరు రూరల్: మండల కేంద్రంలో గాంధీనగర్ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల టెన్త్ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల వార్డెన్, హెచ్‌ఎంలను సస్పెండ్ చేయాలని గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ, విద్యార్థిని బంధువులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు బుధవారం అరకు ఎంపీ తనూజరాణిని ఆమె నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ వారితోపాటు బాలికపై అసత్య ఆరోపణలు చేస్తున్న అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, జీసీసీ చైర్మన్‌ను వేర్వేరుగా కలిసి వినతులు ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. విద్యార్థిని బంధువులు మత్య్సరాజు, గోవింద్, గోపాల్ పాల్గొన్నారు.
బాధిత విద్యార్థిని బంధువులు, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి
కూడా రాధాకృష్ణ డిమాండ్
చర్యలు తీసుకోవాలని
ఎంపీ తనూజరాణికి వినతిపత్రం
Comments
Please login to add a commentAdd a comment