మన్యంలోని పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడాయి. న్యూఇయర్ సం
జి.మాడుగుల: కొత్తపల్లి జలపాతం సందర్శనకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక వాహనాల్లో భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. జలపాతంలో స్నానాలు చేస్తూ సందడి చేశారు. ఫొటోలు, సెల్ఫీలు దిగారు. ప్రకృతి అందాల మధ్య ఉల్లాసంగా గడిపారు.
డుంబ్రిగుడ: ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలవిహారిలో స్థానిక గిరిజనులు థింసా నృత్యాలతో పర్యాటకులను అలరించారు. వారితో కలిపి పర్యాటకులు నృత్యం చేస్తూ సందడి చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు కూడా న్యూఇయర్ వేడుకల్లో భాగంగా థింసా నృత్యాలతో అలరించారు.
చింతపల్లి: మండలంలో లంబసింగిలో సందడి నెలకొంది. నూతన సంవత్సరం సందర్భంగా మైదాన ప్రాంతాల నుంచి భారీగా పర్యాటకులు తరలివచ్చారు. చెరువులవేనం వ్యూపాయింట్ సందర్శకులతో కిక్కిరిసిపోయింది. పాల సముద్రాన్ని తలిపించే మంచు అందాలను చూసి పరవశించిపోయారు. సెల్ఫీలు, ఫొటోలు తీసుకుని సందడి చేశారు. తాజంగి జలాశయానికి పర్యాటకుల తాకిడి నెలకొంది. బోటు షికారు, జిప్ లైన్ ఎక్కి ప్రకృతి అందాలను ఆస్వాదించారు.
చాపరాయిలో థింసా నృత్యం చేస్తున్నస్థానిక గిరిజనులు
Comments
Please login to add a commentAdd a comment