మన్యంపై చలి పంజా
కొనసాగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా చలిగాలులు అధికమయ్యాయి. పాడేరు డివిజన్‌లోని 11 మండలాల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉంది. పొగమంచు దట్టంగా కురుస్తోంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి చలిగాలులు విజృంభిస్తున్నాయి. న్యూఇయర్ వేడుకులకు మన్యానికి వచ్చిన పర్యాటకులు ఫైర్ క్యాంపులను ఆశ్రయించారు. పొగమంచు, చలిగాలులు తీవ్రతతో ఏజెన్సీలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చింతపల్లి: ఏజెన్సీలో బుధవారం డుంబ్రిగుడలో 9.0 చింతపల్లిలో 10.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్‌లోని అరకువ్యాలీలో 10.1,జి. మాడుగులలో 10.4 , పెదబయలులో 10.6, పాడేరులో 10.6, హుకుంపేటలో 11.0, అనంతగిరిలో 12.9, కొయ్యూరులో 15.7 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment