వణికిస్తున్న చలిగాలులు
● దట్టంగా పొగమంచు
సాక్షి,పాడేరు/చింతపల్లి: జిల్లాలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. సాయంత్రం నుంచి వీటి ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఉపశమనం పొందేందుకు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. రాత్రి సమయంలో చలితీవ్రత అధికంగా ఉంటోంది.ఉదయం 9గంటల వరకు పొగమంచు దట్టంగా కురుస్తోంది. పొగమంచుతో సంతలు,వ్యవసాయ పనులకు వెళ్లే గిరిజనులతో పాటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే సోమ వారం కనిష్ట ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి. జి.మాడుగులలో 12.1 డిగ్రీలు, చింతపల్లి 13.2 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్, వాతావరణం విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధిలో హుకుంపేటలో 13.4డిగ్రీలు, పెదబయలులో 13.5, జీకే వీధిలో 13.6,అరుకువేలిలో 13.7, డుంబ్రిగుడలో 13.7, పాడేరులో 14.5, మినుములూరు కేంద్ర కాఫీబోర్డులో 14, ముంచంగిపుట్టులో 15.1, కొయ్యూరులో 15.8, అనంతగిరిలో 16.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment