బాలుడి హత్య
గొడ్డలితో నరికిన మానసిక రోగి
ఎటపాక: నాలుగేళ్ల బాలుడు దారుణ హత్యకు గురైన ఘటన ఎటపాక మండలం లక్ష్మీపురం పంచాయతీ మద్దిగూడెం గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన ముర్రం కోటేశ్వరరావు అనే వ్యక్తి కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో కొన్ని నెలల కిందట అతనిని విడిచిపెట్టి భార్య వెళ్లిపోయింది. అప్పటి నుంచి విపరీతంగా ప్రవరిస్తున్నాడు. గ్రామంలోని కణితి వెంకటేష్,రమ్య దంపతుల నాలుగేళ్ల కుమారుడు నాగరాజు సోమవారం పోలానికి వెళ్లాడు. మరో బాలికతో కలిసి మట్టి కోసం వెళ్లాడని తెలిసింది. ఆ సమయంలో కోటేశ్వరరావు గొడ్డలితో బాలుడిపై దాడిచేసి నరికాడు. తీవ్రంగా గాయపడిన నాగరాజు సంఘటన స్థలంలోనే మరణించాడు. వెంటనే కోటేశ్వరరావు అక్కడ నుంచి పరారైనట్టు తెలిసింది. గ్రామం అటవీ ప్రాంతంలో ఉండటంతో ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment