104 సేవలు మరింత విస్తృతం | - | Sakshi
Sakshi News home page

104 సేవలు మరింత విస్తృతం

Published Tue, Dec 31 2024 2:16 AM | Last Updated on Tue, Dec 31 2024 2:16 AM

104 సేవలు మరింత విస్తృతం

104 సేవలు మరింత విస్తృతం

డుంబ్రిగుడ: జిల్లాలో 104 వైద్య సేవలను మరింత విస్తృతంగా అందించాలని డీఎంహెచ్‌వో జమాల్‌ బాషా తెలిపారు. స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి రాంబాబు ఆధ్వర్యంలో కొర్ర పంచాయతీ బొర్రాపాలెంలో సోమవారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని డీఎంహెచ్‌వో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులతో వైద్య సిబ్బంది స్నేహపూర్వకంగా మెలగాలని, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ శిబిరంలో 36 మందికి వైద్యసేవలందించారు. కించుమండల హెచ్‌వీ పద్మ, హెల్త్‌ ఆసిస్టెంట్‌ లవరాజు, సిబ్బంది జగదిష్‌, రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement