● గిరిజన పల్లెల్లో పండగ సందడి
సాక్షి, పాడేరు: జిల్లావ్యాప్తంగా సంక్రాంతి, కనుమ పండగలను ఘనంగా జరుపుకున్నారు.గిరిజన పల్లెలన్నీ పండగ సందడితో కళకళలాడాయి. జిల్లాకేంద్రమైన పాడేరు పట్టణంలోని పురాతన ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో బుధవారం గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ దేవస్థానం,విశ్వ హిందూపరిషత్ పరిషత్, పాడేరు ఆధ్యాత్మిక సేవాసంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రామంపంతులు, ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, రమాదేవి దంపతులు, ఆఽధ్యాత్మిక కమిటీ, వర్తక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment