పాఠశాలలో.. పోలీసు బందోబస్తుతో..
మాడుగుల నియోజకవర్గంలో కూటమి నేతలు మరో అడుగు ముందుకు వేశారు. దేవరాపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పోలీసు బందోబస్తు నడుమ కోడి పందాలు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి హాజరైన సంక్రాంతి వేడుకల్లో ఇలా జరగడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలను కోడిపందాలకు వేదికగా మార్చడం, పైగా పోలీస్ బందోబస్తు కల్పించంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వైపు ప్రభుత్వ విద్యను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ఇప్పుడు ఏకంగా కోడి పందాలకు ప్రభుత్వ పాఠశాలను కేంద్రంగా మార్చిన కూటమి నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అలాగే భీమిలి, పెందుర్తి, గాజువాక, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం నియోజకవర్గాల్లో కూడా భారీ స్థాయిలో కాకపోయినా.. జోరుగా కోడిపందాలు సాగాయి.
Comments
Please login to add a commentAdd a comment