కొండిబలో తాగునీటి సమస్య పరిష్కారం
అనంతగిరి (అరకులోయ టౌన్): కొండిబ గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు తాగునీటి సమస్య పరిష్కరించామని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. గురువారం కొండిబా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జెడ్పీటిసి గంగరాజు కోరిక మేరకు గత ఏడాది ఈ గ్రామాన్ని సందర్శించానన్నారు. తాగునీటి సమస్య పరిష్కరానికి చర్యలు తీసుకుంటామని గిరిజనులకు ఇచ్చిన హామీని నెరవేర్చానన్నారు. బోరు, ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటుచేసి 150 కుటుంబాలకు కుళాయిల ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నట్టు ఆమె తెలిపారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ గిరిగ్రామాల్లో రహదారి సౌకర్యం కోసం జెడ్పీ నిధుల కేటాయింపు అభినందనీయమన్నారు. కాశీపట్నం పంచాయతీ సీతంపేటలో సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. సీతంపేట, బోందుగుడ రెండు గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణానికి జెడ్పీ నిధులు రూ. 10 లక్షలు కేటాయించిన జెడ్పీ చైర్ పర్సన్‌ను ఆయన అభినందించారు. ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను అభినందించారు. మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతిదేవి మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితం ఈ గ్రామంలోతాను ఎస్.కోట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ. 1.5 లక్షలు
మిగతా II పేజీలో
ఇచ్చిన హామీ నెరవేర్చా
ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్
జల్లిపల్లి సుభద్ర
ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంతో
కలిసి పలు పథకాలకు శంకుస్థాపన
Comments
Please login to add a commentAdd a comment