సెల్ టవర్ల నిర్మాణం వేగవంతం
సాక్షి,పాడేరు: జిల్లాలో సెల్ టవర్ల నిర్మాణాలకు సంబంధించి అన్ని శాఖల జాయింట్ సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం తన కార్యాలయం నుంచి అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్‌టవర్ల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలను అధిగమించాలన్నారు.స్థలాల పరిశీలన, సమగ్రమైన సర్వే చేపట్టి ప్రతిపాదనలు ఇస్తే జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించి అనుమతులు జారీ చేస్తామన్నారు.సర్వే రిపోర్టులు వెంటనే సమర్పించాలన్నారు. ఐటీడీఏ పీవో అభిషేక్, సబ్‌కలెక్టర్ సౌర్యమన్‌పటేల్, డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ ఈఈ కె.వేణుగోపాల్, పంచాయతీరాజ్ ఈఈ కొండయ్యపడాల్, జియో, ఎయిర్‌టెల్, బీఎఎస్‌ఎన్‌ఎల్ అధికారులు పాల్గొన్నారు.
ఈవీఎం గొడౌన్లు కలెక్టర్ తనిఖీ
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఈవీఎంల గొడౌన్లను కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ గురువారం మాసాంతపు తనిఖీలు నిర్వహించారు.దీనిలో భాగంగా అరకు పార్లమెంట్, పాడేరు, రంపచోడవరం,అరకు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంల గొడౌన్ల సీళ్లను ఆయన పరిశీలించారు.సీసీ కెమెరాల వ్యవస్థ,పోలీసు భద్రత చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మలత, డీటీ లక్ష్మణమూర్తి, వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.
త్వరితగతిన జాయింట్ సర్వే
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment