అటవీ ఉత్పత్తుల కొనుగోలుతో ఆర్థికాభివృద్ధి
రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం
రంపచోడవరం: ఏజెన్సీలోని వన్‌ధన్ (వీడీవీకే) వికాస కేంద్రాల సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించేలా అటవీ ఉత్పత్తులు కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీ ఏడు మండలాల్లోని వన్‌ధన్ వికాస కేంద్రాల ద్వారా చింతపండు, జీడిపిక్క, పసుపు, జాఫ్రా కొనుగోలు చేసి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. ఈ ఏడాది 150 మెట్రిక్ టన్నుల జీడిపిక్క, 78 వేల కొండచీపుర్లు, 8వేల కిలోల పసుపు కొమ్ములు, 6వేల కిలోల చింతపండు, 27వేల కేజీల జాఫ్రా గింజల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.వీటిని వనధన్ వికాస కేంద్రాల ద్వారా ప్రాసెసింగ్ చేసి టెండర్ల విధానంలో విక్రయిస్తామన్నారు.ఏజెన్సీలో విద్యుత్, మంచినీరు, మరుగుదొడ్లు లేని అంగన్‌వాడీ కేంద్రాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీడీ డేగలయ్య, ఈఈ ఐ.శ్రీనివాసరావు, సీడీపీవో సంధ్యారాణి, డీపీఎం అపర్ణ, యాంకర్ పర్సన్ రామరాజు,డీఈ మల్లికార్జునరావు, నవజీవన్ ఆర్గనైజేషన్ బిజినెస్ డవలప్‌మెంట్ ప్రతినిధి ఎం.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment