కొనసాగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
● జి.మాడుగులలో 4.9 డిగ్రీల నమోదు
● వణికిస్తున్న చలిగాలులు
● ఉదయం 10 గంటల వరకు వీడని
మంచు తెరలు
సాక్షి, పాడేరు: ఏజెన్సీలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. పొగమంచు తీవ్రత తక్కువగా ఉంది. సూర్యోదయం వేగంగా అయినప్పటికీ చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. మన్యం వాసులు, పర్యాటకులు చలిమంటలను ఆశ్రయించారు.
చింతపల్లి: మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొన సాగుతున్నాయి. శీతల గాలులకు ప్రజలు వణికిపోతున్నారు. చింతపల్లి ప్రాంతంలో మంచు తీవ్రత ఎక్కువగా ఉంటోంది. జిల్లాలో గురువారం జి.మాడుగులలో 4.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధిలోని హుకుంపేటలో 5.6, పాడేరులో 5.9, అరకువ్యాలీలో 6.6, పెదబయలులో 6.6, డుంబ్రిగుడలో 7.1, చింతపల్లిలో 7.8, అనంతగిరిలో 10.3, ముంచంగిపుట్టులో 10.4, కొయ్యూరులో 12.7 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు. ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. వాహనచోదకులు హెడ్‌లైట్ల వెలుగులో రాకపోకలు సాగిస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి చలిగాలులు వీస్తుండటంతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment