![పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10ark60-320098_mr-1739218638-0.jpg.webp?itok=g0uvb009)
పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలి
హుకుంపేట: పిల్లలందరికీ నులి పురుగుల నివారణ మాత్రలు తప్పనిసరిగా వేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ ఆదేశించారు. సోమవారం స్థానిక కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి జమాల్‌బాషాతో కలిసి విద్యార్థినులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలందరూ నులిపురుగుల మాత్రలు వేసుకోవాలని చెప్పారు. ఈ మాత్రలు వేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. జిల్లాలో 3.35 లక్షల మంది పిల్లలు ఉన్నారని, అందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు అందజేయాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. నులి పురుగుల వల్ల రక్తహీనత, ఆకలి మందగించడం, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరోచనలు, బరువు తగ్గడం వంటి సమస్యలు ఏర్పడతాయని చెప్పారు. వీటిని నిర్మూలించాలంటే తప్పకుండా మాత్రలు వేసుకోవాలని తెలిపారు. అనంతరం పాఠశాలలో 8వ తరగతి విద్యార్థినులతో ఇంగ్లిష్ చదివించారు. వారు సరిగ్గా చదవకపోవడంతో ఇంగ్లిష్ టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రామ్ అధికారి ప్రతాప్,గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రజని,డీఈవో బ్రహ్మాజీ, పీహెచ్‌సీ వైద్యాధికారులు కిషోర్ కుమార్, లక్ష్మయ్య,ఎంఈవోలు చెల్లయ్య,ఈశ్వరరావు,స్థానిక వైద్యాధికారులు మోహన్‌సాయి రెడ్డి,సౌజన్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment