![కొత్త కథ సిద్ధం..](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10adr41-320017_mr-1739218639-0.jpg.webp?itok=NaSr_BNK)
కొత్త కథ సిద్ధం..
డైరెక్టర్ పరశురాం
కోటవురట్ల : డైరెక్టర్ పెట్ల పరశురాం కోటవురట్ల మండలం జల్లూరు శివారున జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో సోమవారం పాల్గొన్నారు. నాతవరం మండలం చెర్లోపాలేనికి చెందిన పరశురాం కోటవురట్ల మండలంలోని బి.కె.పల్లికి చెందిన ప్రముఖ డైరెక్టర్ పెట్ల పూరీజగన్నాఽథ్‌కు బంధువు. స్వశక్తితో ఎదిగి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న పరశురాం ఎల్లపుడూ కొత్తదనంతో దర్శకత్వం చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆయన ఇప్పటి వరకు 8 సినిమాలకు దర్శకత్వం వహించగా గీతగోవిందం సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత వాసిగా సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినందుకు గర్వంగా ఉంటుందన్నారు. ఇప్పటి వరకు 8 సినిమాలకు దర్శకత్వం వహించగా మరో సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం అయ్యిందని, దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కించేందుకు మెరుగులు దిద్దుతున్నట్టు తెలిపారు. ఈయనకు కై లాసపట్నానికి చెందిన లక్కబొమ్మల కళాకారుడు తంగేటి రాంబాబు తాను తయారు చేసిన మాతృమూర్తి బొమ్మను బహూకరించారు.
Comments
Please login to add a commentAdd a comment