![వేటమా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10rcvm121-420003_mr-1739218639-0.jpg.webp?itok=c5Qjsc05)
వేటమామిడిలో పశు వైద్య శిబిరం
అడ్డతీగల: వేటమామిడిలో ‘అంతు చిక్కని అనారోగ్యంతో పశువులు మృతి’ శీర్షికతో ‘సాక్షి’లో ఈనెల 10వ తేదీన ప్రచురితమైన వార్తకు పశుసంవర్దకశాఖ అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా వేటమామిడి, పణుకురాతిపాలెం గ్రామాల్లో సోమవారం ఉచిత పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. రెండు గ్రామాల్లోనూ పశువైధ్యాధికారి తరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో 42 పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసినట్టు పశుసంవర్ధకశాఖ అడ్డతీగల అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్.గణేష్ తెలిపారు.అలాగే వేటమామిడిలో 20 లేగదూడలకు ఏలిక పాముల మందు వేశామన్నారు. 42 గొర్రెలు, మేకలకు జలగరోగ నివారణ మందు ఇచ్చినట్టు పేర్కొన్నారు. పశువులకు సోకే వ్యాధులపై అవగాహన కల్పించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించినట్టు తెలిపారు.
![వేటమామిడిలో పశు వైద్య శిబిరం 1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/11022025-alr_dist-02_subgroupimage_1883347584_mr-1739218639-1.jpg)
వేటమామిడిలో పశు వైద్య శిబిరం
Comments
Please login to add a commentAdd a comment