![వందేభారత్‌లో సిగరెట్ పొగ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10vsc23-606377_mr-1739218640-0.jpg.webp?itok=9jndCjax)
వందేభారత్‌లో సిగరెట్ పొగ
టీసీని నిలదీసిన ప్రయాణికులు
సాక్షి, విశాఖపట్నం: వందేభారత్ రైలులో సిగరెట్ పొగ కలకలం సృష్టించింది. విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు సోమవారం ఉదయం బయల్దేరిన వందేభారత్ రైలు బాత్‌రూమ్‌లో ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగాడు. బోగీ మొత్తం పొగ, సిగరెట్ వాసన రావడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అక్కడికి వచ్చిన టీసీని నిలదీశారు. ట్రైన్‌లోని సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి.. సిగరెట్ తాగిన ప్రయాణికుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై సదరు టీసీ తనకేం సంబంధం లేదని, తానేం చెయ్యలేనంటూ ప్రయాణికులతో వాదనకు దిగారు. సిగరెట్ కారణంగా ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే బాధ్యులెవరంటూ ప్రయాణికులు ప్రశ్నించారు. దీంతో టీసీ అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయారు. ఈ వ్యవహారం మొత్తం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనిపై స్పందించిన రైల్వే అధికారులు.. సిగరెట్ తాగిన ప్రయాణికుడ్ని గుర్తించి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment