అన్ని పనులు సక్కగా జరుగుతున్నాయి.. | Sakshi
Sakshi News home page

అన్ని పనులు సక్కగా జరుగుతున్నాయి..

Published Mon, May 6 2024 9:30 AM

అన్ని

జగన్‌బాబు వచ్చినప్పటి నుంచి సక్కగా పనులు జరుగుతున్నాయి. వోలింటీర్లు ఇంటికాడికొచ్చి పించినీలు ఇచ్చేవారు. ఇళ్ల స్థలాలు రూల్‌ పెకారం ఇచ్చినారు. పథకాలు కూడా ఎక్కడికీ తిరక్కుండా ఇంటి వద్దే అందుకున్నాం. – బి.శ్రీరాములు

ఇంటికొచ్చి పించినీ ఇచ్చీవోరు..

వోలింటీర్లు ఇంటికొచ్చి పించినీ ఇచ్చీవోరు. మా కుటుమానికి ఆ పించినీ సొమ్మే ఆధారం. రెండు నెలలుగా పించినీ డబ్బుల కోసం కాళ్లరిగేలా తిరగాల్సి వత్తాంది. జగన్‌బాబు పాలన బంగారం కాదూ.. – ఎ.సూరి అప్పారావు

జగన్‌ మాటిత్తే మడమ తిప్పడు..

జగన్‌బాబు మాటిత్తే మడమ తిప్పడు. ఇచ్చిన హామీలన్నీ సేసి సూపించాడు కదా. మాలాంటి ముసలాళ్లకు ఎంతో మేలు సేసినాడు. ఇంటి కాడికే సంచేమ పథకాలు అందజేసినాడు. లంచాలు, దళారుల బెడద బెగులు లేకుండా బ్యాంకుల్లోనే సొమ్ములేసినాడు.

– పి.నాగబాబు

గొర్రెల్లాగ పరిగెత్తిస్తున్నారు...

పించినీ కోసం గొర్రెలనాగా పరుగులుపెట్టిత్తన్నారు. జగన్‌బాబు పాలనలో అందరికీ మేలు జరిగింది. ఇంటికాడికొచ్చి పించినీ ఇచ్చే రోజులు వచ్చినప్పుడు సంతోషమేసింది. మళ్లీ ఇప్పుడు పించినీ కోసం పరుగులు పెట్టిత్తన్నారు. – డి.శివ

అన్ని పనులు సక్కగా జరుగుతున్నాయి..
1/3

అన్ని పనులు సక్కగా జరుగుతున్నాయి..

అన్ని పనులు సక్కగా జరుగుతున్నాయి..
2/3

అన్ని పనులు సక్కగా జరుగుతున్నాయి..

అన్ని పనులు సక్కగా జరుగుతున్నాయి..
3/3

అన్ని పనులు సక్కగా జరుగుతున్నాయి..

Advertisement
 
Advertisement