బార్క్ రోడ్డును పరిశీలించిన జేసీ
మునగపాక: మండలంలో నాగవరం పంచాయతీ పరిధిలోని బార్క్ రోడ్డును జేసీ జాహ్నవి గురువారం పరిశీలించారు. బార్క్ రోడ్డు ఏర్పాటులో భాగంగా వుడా లే–అవుట్‌లో కోల్పోయిన ప్లాట్ లబ్ధిదారులు తమకు ప్రభుత్వం తగు నష్టపరిహారం చెల్లించడంతోపాటు గతంలో వేసిన ఫెన్సింగ్ తీసివేయాలని కోరుతూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె స్థల పరిశీలన చేశారు. 2004లో వుడా ద్వారా అన్ని అనుమతులు తీసుకుని లే–అవుట్ వేశారని, పలువురు మధ్య తరగతి ఉద్యోగస్తులు ప్లాట్‌లు కొనుగోలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బార్క్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు 2005లో నోటిఫికేషన్ ఇచ్చారని బాధితులు వివరించారు. అప్పటి నుంచి న్యాయ స్థానాల చుట్టూ తమకు న్యాయం చేయాలని ఆర్జించామన్నారు. 2013 భూ చట్టం ప్రకారం పరిహారం అందించాలన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్లాట్‌లు పోయిన వారికి పరిహారం ఇవ్వడంతో పాటు ఫెన్సింగ్ తొలగించేలా చూడాలని కోరారు. ఇందుకు స్పందించిన ఆమె రికార్డులు పరిశీలిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment