ఆగి ఉన్న లారీని ఢీకొని యువకుడి మృతి
అనకాపల్లి: ఆగి ఉన్న లారీని ఢీకొని మండలంలో చింతనిప్పుల అగ్రహారం గ్రామానికి చెందిన కోరుకొండ సురేష్(24) దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ ఎస్‌ఐ డి.శేఖరం వివరాల మేరకు... స్థానిక జాతీయ రహదారి జలగల మధుం జంక్షన్ పెట్రోల్ బంక్ సమీపంలో స్టోన్ క్రషర్ లారీ రిపేరుతో ఆగిపోయింది. ఈ క్రమంలో గాజువాక నుంచి చింతనిప్పుల అగ్రహారం వెళ్తుతున్న సురేష్ తన ద్విచక్ర వాహనంతో లారీ వెనుక వైపు గుద్దడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తండ్రి చందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment