వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
నక్కపల్లి: మండలంలో గురువారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. డొంకాడకు చెందిన కందిపల్లి సత్యనారాయణ(62) పశువుల కోసం పోలవరం కాలువ గట్టుకెళ్లి కాలుజారి అందులో పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇతని కోసం గాలించడంతో కాలువలో శవమై తేలాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో వి. మాడుగుల మండలం వీరవల్లి అగ్రహారం గ్రామానికి చెందిన ముత్తా గోవిందరావు (40) హెట్రోలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. గురువారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లి కొండవెనుకపాలెం సమీపంలో రోడ్డు పక్కన గొయ్యిలో ప్రమాదవశాత్తు పడి మరణించాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు హెస్‌సీ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment