తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటక పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటక పోటీలు ప్రారంభం

Published Fri, Oct 4 2024 2:34 AM | Last Updated on Fri, Oct 4 2024 2:34 AM

తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటక పోటీలు ప్రారంభం

తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటక పోటీలు ప్రారంభం

అనకాపల్లి: కర్రి రమేష్‌ మెమోరియల్‌ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. గవరపాలెం సతకంపట్టు కనకదుర్గ నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని గౌరీ సేవా సంఘం మళ్ల జగన్నాథం కల్యాణ మండపంలో ఈ పోటీలను మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ప్రారంభించారు. ఈ నెల 7వ తేదీ వరకూ ఈ నాటికలు ప్రదర్శించనున్నారు.

రాత నాటిక...

ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామం వేలగలేరు థియేటర్‌ ఆర్ట్స్‌ వారి ‘రాత నాటిక’ ప్రదర్శన ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. మనిషికి కష్టం కలిగితే నా రాతింతే, నా రాత బాగోలేదు అంటూ ఉసూరుమంటాడు. సుఖం విషయంలో మాత్రం రాతను గాలికొదిలేస్తాడు. తాను పొందాల్సినవి మంచిగా పొందుతాడు. తాను తిరిగి ఇవ్వాల్సిన వాటి విషయంలో మాత్రం బాధ్యతా రహితంగా ఉంటాడు. అది ఎదుటి మనిషి విషయంలోనైనా, ప్రకృతి విషయంలోనైనా, ఇలాంటి మనిషి నైజం వల్ల ప్రస్తుత సమాజంలో ఎం జరుగుతోంది..? సమాజం ఎటుపోతోంది..? మనిషి జీవనం ఎలా సాగుతోంది..? ఈ అనర్థాలకు కారణం ఎవరూ...? ఇది ఎవరు రాసిన రాత...? అని ప్రస్తుత సమాజ పోకడలకు అద్దం పట్టేలా పాత్రధారులు ప్రదర్శించారు. స్వప్నిక. సురభివాగ్ధేవి, గోవర్దన్‌, శ్రీనివాసరావు పోలుదాసు, కిరణ్‌, సురభి రాఘవ, అజయ్‌, పవన్‌కల్యాణ్‌, బ్రహ్మ, బి.కొండలరావు నటించి తమ పాత్రలకు జీవం పోశారు. పోలుదాసు శ్రీనివాసరావు రచన, దర్శకత్వం వహించారు.

అజరామరం....నాటిక...

హైదరాబాద్‌ కళావర్షిణి వారిచే అజరామరం నాటిక నిర్వహించారు. పలువురిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నాటికకు రచనతోపాటు దర్శకత్వం జెట్టి హరిబాబు వహించారు. కార్యక్రమంలో కనకదుర్గ అమ్మవారి ఆలయ శాశ్వత చైర్మన్‌ కాండ్రేగుల నాయుడు, ఉత్సవ కమిటీ చైర్మన్‌ భీమరశెట్టి వరహా నూకరాజు, ఆలయ వ్యవస్థాపకుడు పి.వి.రమణ, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement