ఆధిక్యంలోకి అంగద్
● రెండో స్థానంలో కొనసాగుతున్న అమన్‌రాజ్
విశాఖ స్పోర్ట్స్: వైజాగ్ ఓపెన్ 2024 గోల్ఫ్ టోర్నీ రెండో రౌండ్‌లో వ్యక్తిగత అత్యుత్తమ –10 స్కోర్, నాలుగు షాట్లతో అంగద్ చీమా అగ్రస్థానానికి చేరుకున్నాడు. రెండు రౌండ్లలోనూ –12 స్కోర్‌తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. గతవారం జరిగిన టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన చండీగఢ్‌కు చెందిన అంగద్ చీమాకు ఇదే వ్యక్తిగత అత్యుత్తమ స్థానం. అంగద్ ప్రస్తుత సీజన్‌లో ఆరు టాప్–10లతో పీజీటీఐ ర్యాంకింగ్‌లో నాలుగో స్థానానికి చేరాడు. విశాఖలోని ఈస్ట్‌పాయింట్ గోల్ఫ్‌క్లబ్‌లో గురువారం రెండో రోజు జరిగిన మ్యాచ్‌ల్లో పాట్నాకు చెందిన అమన్‌రాజ్ తన రెండో రౌండ్ అనంతరం–8(134) వద్ద రెండో స్థానం, బెంగళూర్‌కు చెందిన ఆర్యన్ రూప ఆనంద్–7 స్కోర్‌తో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. మొత్తంగా తొలి రెండు రౌండ్లలో 126 మంది పోటీపడగా 143 వద్ద కట్ ప్రకటించడంతో 57 మంది గోల్ఫర్లు పోటీలో నిలిచి మూడో రౌండ్‌కు సిద్ధమయ్యారు. పదకొండేళ్ల క్రితం టైటిల్ సాధించిన అంగద్ ఈసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో మూడోరౌండ్‌కు సిద్ధమయ్యాడు. తొలిరౌండ్ ముగిసేటప్పటికి 13వ స్థానంలో నిలిచినా రెండో రౌండ్ ముగిసేటప్పటికి ఆధిక్యంలోకి దూసుకొచ్చాడు. తొలిరౌండ్‌లో ఆధిక్యాన్ని ప్రదర్శించిన మిలింద్ అండర్ 5 స్కోర్‌తో, ధృవ్‌తో కలిసి ఉమ్మడిగా ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. కెనడాకు చెందిన శుఖ్‌రాజ్‌తో కలిసి డిఫెండింగ్ చాంప్ శ్రీలంకకు చెందిన తంగరాజ ఉమ్మడిగా 16వ స్థానంలో అండర్ 2 స్కోర్లతో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment