మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు
గొలుగొండ: దేశంలో మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయని, వాటి పరిరక్షణ కోసం అధికారులు పనిచేస్తున్నారని జిల్లా న్యాయమూర్తి ఎం. వెంకట శేషమ్మ తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రధానంగా మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇంటిని చక్కదిద్దికోవడంలో మహిళలు కీలకపాత్ర పోషించుకోవాలన్నారు. చిన్న చిన్న విషయాలకు ఆవేశపడవద్దని తెలిపారు. ప్రతి గ్రామంలో ఐసీడీఎస్ సిబ్బంది మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. ఈ చట్టాలు వల్లే దేశంలో ఎంతో మందికి న్యాయం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో నర్సీపట్నం ఇన్‌చార్జి సీఐ కుమారిస్వామి, నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ జె. సురేంద్ర, ఐసీడీఎస్ పీడీ అనంతలక్ష్మి, డీఆర్‌డీఏ ఏపీడీ డైజీ, గొలుగొండ తహసీల్దార్ శ్రీనువాసరావు, ఐసీడీఎస్ పీవో శ్రీగౌరి, మహిళలు, అధికారులు పాల్గొన్నారు.
● జిల్లా న్యాయమూర్తి వెంకట శేషమ్మ
Comments
Please login to add a commentAdd a comment