రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పయనం
● వేచలం విద్యార్థులకు వీడ్కోలు
దేవరాపల్లి: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు మండలంలోని వేచలం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు గురువారం రాజమహేంద్రవరం పయనమయ్యారు. ఆగస్టులో ఆంధ్ర విశ్వవిద్యాలయం జూబ్లి హాల్ గ్రౌండ్‌లో జరిగిన జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో వీరు విశేష ప్రతిభ కనబరిచారు. అండర్–16 బాలికల విభాగంలో 9వ తరగతి విద్యార్థిని బి. చైతన్య పెంటాథ్లాన్ ఈవెంట్‌లోను, అండర్–16 బాలుర విభాగంలో టెన్త్ విద్యార్థి వి. నారిబాబు హైజంప్‌లోను, మరో టెన్త్ విద్యార్థి టి. రవిశంకర్ 5 కి.మీ రేస్ వాక్‌లో ప్రథమ స్థానాలు సాధించారు. అండర్–20 బాలికల విభాగంలో ఆర్. భారతి 200 మీటర్లు, 400 మీటర్ల రన్నింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచారు. వీరంతా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో జరిగే రాష్ట్ర స్థాయి సబ్ జూనియన్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంనేందుకు పీడీ ఆర్. తమ్మునాయుడుతో కలిసి బయలుదేరి వెళ్లారు. వీరికి హెచ్‌ఎం డి. నర్సింహమూర్తి, సర్పంచ్ నాగిరెడ్డి శఠారినాయుడు, ఎంపీటీసీ రెడ్డి శ్రీలక్ష్మి, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ నగేష్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు వీడ్కోలు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment