పనులు వేగవంతం చేయండి
కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న వీఎంఆర్‌డీఏ కమిషనర్ విశ్వనాథన్
విశాఖ సిటీ: వీఎంఆర్‌డీఏ చేపట్టిన పనులను వేగవంతం చేయాలని వీఎంఆర్‌డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంలో గురువారం ఆయన వీఎంఆర్‌డీఏ చేపట్టిన నిర్మాణాలను, భూములను సందర్శించారు. ముందుగా వేపగుంట ప్రాంతంలో ఉన్న చీమలాపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న రెండు అంతస్తుల కన్వెన్షన్ సెంటర్ భవనాన్ని పరిశీలించారు. మార్పులు చేర్పులు సూచించి, పనులను వేగవంతం చేయాలని చెప్పారు. అనంతరం పెదగంట్యాడలో ఓపెన్ ఆడిటోరియం, కేఎల్ రావు నగర్, కూర్మన్నపాలెం, అగనంపూడి వద్ద సంస్థకు చెందిన భూములను పరిశీలించారు. ఈ పర్యటనలో ఎస్టేట్ అధికారి లక్ష్మారెడ్డి, ముఖ్య ప్రణాళికా అధికారి శిల్పా, ప్రధాన ఇంజనీర్ భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment