క్విజ్ పోటీలో విజేతలకు బహుమతి ప్రదానం
విద్యార్థులకు సర్టిఫికెట్లు అందిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: విద్యతోపాటు క్విజ్ పోటీల వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో విజ్ఞానాన్ని మరింత పెంపొందించవచ్చని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా జిల్లా అంధత్వ నివారణ సంస్ధ ఆధ్వర్యంలో పది, ఇంటర్ విద్యార్థులకు నేత్రదానంపై గత నెల క్విజ్ పోటీలు నిర్వహించారు. మొదటి ఐదు స్ధానాల్లో నిలిచిన విద్యార్థులకు గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ విజయ కృష్ణన్ సర్టిఫికెట్లతోపాటు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో అన్ని అంశాలపై విద్యార్థి దశలోనే అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంధత్వ నివారణ సంస్ధ జిల్లా ప్రాజెక్టు అధికారి రమణకుమార్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment