రిజర్వాయర్లలో పూర్తిస్థాయి నీటి నిల్వలు
మహారాణిపేట (విశాఖపట్నం): ఉమ్మడి విశాఖ జిల్లాలోని రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయని జలవనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్‌ఈ) శంబంగి సుగుణాకరరావు తెలిపారు. విశాఖ జలవనరుల శాఖ ఎస్‌ఈగా గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ఇక్కడ ఎస్‌ఈగా పనిచేసిన సూర్యకుమార్ ఆగస్టు 31న ఉద్యోగ విరమణ చేశారు. ఎంతో కీలకమైన ఎస్‌ఈ పోస్టు భర్తీలో జాప్యం జరిగింది. అప్పటి నుంచి ఈ పోస్టులో ఎవరినీ నియమించకపోగా.. ఇన్‌చార్జి కూడా ఇవ్వలేదు. ఎట్టకేలకు తోటపల్లి రిజర్వాయర్ (విజయనగరం) ఎస్‌ఈగా పని చేస్తున్న శంబంగి సుగుణాకరరావును బదిలీపై ఇక్కడకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విశాఖలోని రిజర్వాయర్లలో నీటిమట్టం సామర్థ్యానికి మించి ఉంటే గేట్లు ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు నీటి ఇబ్బందులు లేవని, రూ.15 కోట్లతో 295 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించినట్లు వెల్లడించారు. సాగుకు అవసరమ యిన విధంగా నీరు అందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment