డిబ్రూగడ్‌–హుబ్బళ్లి మధ్య వన్‌వే స్పెషల్‌ | - | Sakshi
Sakshi News home page

డిబ్రూగడ్‌–హుబ్బళ్లి మధ్య వన్‌వే స్పెషల్‌

Published Fri, Oct 4 2024 2:54 AM | Last Updated on Fri, Oct 4 2024 2:54 AM

డిబ్రూగడ్‌–హుబ్బళ్లి మధ్య వన్‌వే స్పెషల్‌

డిబ్రూగడ్‌–హుబ్బళ్లి మధ్య వన్‌వే స్పెషల్‌

తాటిచెట్లపాలెం (విశాఖ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా డిబ్రూగడ్‌–హుబ్బళ్లి మధ్య స్పెషల్‌ రైలు నడుపుతున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం సందీప్‌ తెలిపారు. డిబ్రూగడ్‌–హుబ్బళ్లి(05926) వన్‌ వే స్పెషల్‌ ఈ నెల 5వ తేదీ (శనివారం) మధ్యాహ్నం 1.30 గంటలకు బయల్దేరి మూడో రోజు సోమవారం మధ్యాహ్నం 3.08 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.10 గంటలకు బయల్దేరి నాల్గవ రోజు మంగళవారం ఉదయం 9 గంటలకు హుబ్బళ్లి చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలు 10–స్లీపర్‌ క్లాస్‌, 2–జనరల్‌ సెకండ్‌ క్లాస్‌, 2–సెకండ్‌ క్లాస్‌ కమ్‌ లగేజీ /దివ్యాంగ కోచ్‌లతో నడుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement