బంగారం, నగదు చోరీ
ఎస్.రాయవరం: మండలంలోని గెడ్డపాలెంలో ఓ ఇంట్లో దొంగలు పడి మూడున్నర తులాల బంగారం, రూ.10 వేల నగదు చోరీ చేశారు. ఎస్ఐ విభీషణరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 9న గ్రామానికి చెందిన కర్రి శాంతికుమార్ బంధువు చనిపోయారు. దీంతో మైలు పట్టిన శాంతికుమార్ కుటుంబ సభ్యులు అప్పటి నుంచి ఇంట్లోకి వెళ్లలేదు. శుక్రవారం ఇంటిని శుభ్రం చేయడానికి శాంతికుమార్ మేనకోడలు వెంకట నవకదుర్గ ఇంట్లోకి వెళ్లింది. వస్తువులు చిందర పడిఉండడం గమనించి కుటుంబ సభ్యులకు చెప్పింది. బీరువా తలుపులు తెరచి ఉండడాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి అడ్డురోడ్డు సీఐ రామకృష్ణ, ఎస్ఐ విభీషణరావు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ వివరాలు సేకరించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment