నావిక్ సెల్ 21పై వీపీఏ సమీక్ష
విశాఖ సిటీ: విశాఖ పోర్ట్ అథారిటీ నావిక్ సెల్ 21పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ సమావేశానికి పోర్ట్ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు అధ్యక్షత వహించారు. పలు మంత్రిత్వ శాఖలు, సంబంధిత సంస్థల నుంచి సీనియర్ అధికారులు దీనికి హాజరయ్యారు. నావిక్ సెల్‌కు సంబంధించి గత సమీక్షా సమావేశాల్లో కేంద్ర నౌక, జల రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శి అందించిన మార్గదర్శకాల అమలు, మంత్రిత్వ శాఖల సహకారం, సముద్ర రంగానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణపై ఇందులో చర్చించారు. నౌకాయాన రంగంలో ముఖ్యమైన అంశాలపైన సమగ్రమైన విధానాలను రూపొందించే దిశగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. ఈ సమీక్షలో రైల్వే, హోం, పర్యావరణ, అటవీ, రోడ్డు రవాణా, హైవేస్, పునరుత్పాదక శక్తి వంటి వివిధ మంత్రిత్వ శాఖల నుంచి సంబంధిత విధానాలు, చట్టాలు, మార్గదర్శకాలను కూడా పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment