ప్రకృతి వైపరీత్యాలపై అప్రమత్తం
రాంబిల్లి (యలమంచిలి): ప్రకృతి వైపరీత్యాలు,విపత్తులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తతంగా ఉండాలని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) కమాండర్ సత్యనారాయణ అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించింది. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ నుంచి 27వ తేదీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అనంతరం రెవెన్యూ,పోలీసు,యలమంచిలి అగ్నిమాపకశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సభ్యులు మాక్‌డ్రిల్ నిర్వహించి తుపాన్లు, వరదలు సంభవించినప్పుడు, పిడుగులు పడినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రత్యక్షంగా వివరించారు. గ్యాస్ లీకై నప్పుడు,అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన చర్యలు, గాయాలు తగిలినప్పుడు చేయవలసిన ప్రథమ చికిత్స గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో రాంబిల్లి తహసీల్దారు శ్రీనివాసరావు,రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, సీఐ సీహెచ్. నర్సింగరావు,యలమంచిలి అగ్నిమాపకశాఖ అధికారి డి.రాంబాబు, రాంబిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విపత్తుల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం
రాంబిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాక్‌డ్రిల్
Comments
Please login to add a commentAdd a comment