హుండీల చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
● అనకాపల్లిలోని పలు ఆలయాల్లో హుండీల చోరీ ● నిందితుడి నుంచి నగదు, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం
సబ్బవరం: మండంలోని రాయపుర అగ్రహారం శ్రీకృష్ణుడి ఆలయంలో అక్టోబర్ 9న జరిగిన హుండీ చోరీ కేసును సబ్బవరం పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన వ్యక్తి నుంచి రూ.11,554 నగదు, బైక్, ఒక సెల్‌ఫోన్‌తో పాటు చోరీకి వినియోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి, అనకాపల్లి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ పిన్నింటి రమణ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశం వివరాలను వెల్లడించారు. సబ్బవరం మూడు రోడ్ల కూడలి సమీపంలోని సినిమాహాల్ జంక్షన్ టీ స్టాల్ వద్ద ఒక వ్యక్తి చిల్లర కాయిన్స్ ఇచ్చి నోట్లు అడుగుతుండటంతో అక్కడే తన సిబ్బందితో ఉన్న ఎస్‌ఐ సింహాచలం అనుమానం వచ్చి స్టేషన్‌కు తరలించి విచారించారు. అతడిని శెట్టి నాయుడుగా గుర్తించారు. నాలుగేళ్లుగా బెలూన్ల డెకరేషన్ పనిచేస్తూ అనకాపల్లి గూండాల వీధిలో నివాసం ఉంటున్నాడు. అక్టోబర్ 9న రాయపుర అగ్రహారంలోని శ్రీకృష్ణ ఆలయంలో హుండీ తాళం పగులగొట్టి అందులోని నగదును సంచిలో వేసుకుని, హుండీని పక్కనే ఉన్న తుప్పల్లో పడేసి పోయాడు. ఈ నెల 9న జీ కోడూరు మండలం, వారాడలోని దుర్గాలమ్మ గుడి హుండీని, 2022 మార్చిలో దేవరాపల్లి మండలంలోని కలిగొట్ల గ్రామంలో పైడితల్లమ్మ గుడి హుండీని కూడా శెట్టి నాయుడే చోరీ చేసినట్లు విచారణలో తేలిందని సీఐ వెల్లడించారు. నిందితుడు నాయుడుని ఆరెస్టు చేసి, అనకాపల్లి కోర్టుకు తరలించామన్నారు. సమావేశంలో సీఐతోపాటు ఎస్‌ఐ సింహాచలం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment