జీవితంలో స్థిరపడేంత అనుభవం
ఈ రైలు ఎక్కిన వారంతా 30 ఏళ్లలోపు వాళ్లే. తమ ప్రయాణంలో జీవితంలో స్థిరపడేంత అనుభవాన్ని సంపాదించుకుంటారు. ముఖ్యంగా ఎడ్యుప్రెన్యూర్ షిప్, అగ్రి, సోషల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్స్పై అవగాహన ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. ఈ ఏడాది భారత్తో పాటు 23 వివిధ దేశాలకు చెందిన 525 మంది యాత్రికులను వడపోత ద్వారా ఎంపిక చేశారు. ఈనెల 16న ముంబైలో మొదలైన రైలు 12 నగరాల్లో తిరిగి డిసెంబర్ 1న ముంబైలో ముగియనుంది. శుక్రవారం పెందుర్తి రైల్వే స్టేషన్కు జాగృతి రైలు చేరుకుంది. యువతీయువకులు పెందుర్తి నుంచి నేరుగా గంభీరంలోని అక్షయపాత్రను సందర్శించారు. అక్కడి నుంచి గీతం యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులు, ప్రొఫెసర్లతో సంభాషించారు.
Comments
Please login to add a commentAdd a comment