సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి/తగరపువలస : సాధారణంగా చూసేందుకు అది రైలే. కానీ మరింత పరికించి చూస్తే అదో కదిలే విశ్వవిద్యాలయం. ప్రతి బోగీ ఒక తరగతి గది. ఆలోచనలకు పదునుపెట్టాలన్నా.. వాటి నుంచి అద్భుతాలను ఆవిష్కరించాలనే కాంక్ష యువతరంలో బలంగా నాటుకోవాలన్నా.. విజ్ఞానాన్ని, సృజనాత్మకతను పెంపొందించాలన్నా..ఆ రైలులో కూర్చుంటే చాలు. జీవితానికి సరిపడా జ్ఞానాన్ని ఆ ప్రయాణంలోనే సముపార్జించుకోవచ్చు. ఆ ప్రయాణం పేరే జాగృతి యాత్ర. కేవలం నడిచేది 15 రోజులే అయినా జీవితాంతం తప్పటడుగులు వెయ్యకుండా నడిచేంత ధైర్యాన్ని నూరిపోస్తుందీ యాత్ర. తమను తాము తెలుసుకునేందుకు ముంబైలో బయలుదేరిన జాగృతి యాత్ర రైలు శుక్రవారం విశాఖ చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment