బాల్య వివాహానికి బ్రేక్
చోడవరం: మైనార్టీ తీరని మైనర్ బాలికకు పెద్దలు చేస్తున్న వివాహాన్ని అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. తెల్లారితే వివాహం అనగా అధికారులు వచ్చి పెద్దలకు నచ్చచెప్పి పెళ్లిని వాయిదా వేయించారు. గోవాడ గ్రామానికి చెందిన అబ్బాయికి ముద్దుర్తి గ్రామానికి చెందిన మైనర్ బాలిక (17)కు ఈనెల 23వ తేదీన వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు. ఇంతలో అధికారులకు సమాచారం తెలియడంతో ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి ఉషారాణి ఆధ్వర్యంలో చోడవరం పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అప్పలరాజు, చైల్డ్ వెల్ఫేర్ ప్రతినిధుల బృందం గోవాడలో పెళ్లి మండపానికి వచ్చింది. బాలిక మేజర్ కానందున వివాహం నిలిపివేయాలని ఆదేశించారు. ఇరు కుటుంబాల పెద్దలను, కుటుంబసభ్యులను పిలిచి బాలికకు మైనార్టీ తీరే వరకూ వివాహం చేయవద్దని నచ్చచెప్పారు. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.
పెళ్లి పెద్దలను ఒప్పించిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment